13 July, 2026 | 8:38 PM

దంపతులపై పడిన చెట్టు.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు

21-05-2024 11:31 AM

హైదరాబాద్: బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులపై చెట్టు విరిగిపడిన ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న దంపతులపై చెట్టు పడింది. దంపతులు రవీందర్, సరళాదేవి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. ఈ ప్రమాదంలో సరళాదేవికి తీవ్రగాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.