డీజీపీ వాట్సాప్ ఫొటోతో మోసాలు.. డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్
హైదరాబాద్: సైబర్ నేరాలకు అంతులేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోయాయి. కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు ఒడిగట్టారు. వాట్సప్ డీజీపీ రవిగుప్తా ఫొటో డీపీగా పెట్టి మోసాలు చేస్తున్నారు. వ్యాపారవేత్తకు, అతడి కుమారైకు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని, ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నామని ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.
డ్రగ్స్ కేసు నుంచి తప్పించేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపార వేత్త సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాకిస్థాన్ కోడ్+92తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






