27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

చెట్ల గాథలు

17-11-2025 01:40 AM

చెట్లు ః నాటినదీ చూశా, పెంచినదీ చూశా, కొట్టినదీ చూశా, కాల్చినదీ చూశా.

గాలిని ఆలింగనంచేసినవీ చూశా, పక్షులకు గూళ్లునవీ చూశా,

పశువులకు మేతైనవీ చూశా, జీవులకు ఆధారమైనవీ చూశా.

పూసి పరిమళించినవీ చూశా,పొంకాలు చూపి మురిపించినవీ చూశా,

సౌరభాలు చల్లి సంతసపెట్టినవీ చూశా, ప్రకృతిని పరవశింపజేసినవీ చూశా.

కాయలతో తీపి పంచినవీ చూశా, జీవితాలను పోషించినవీ చూశా,

తనువులను తృప్తిపరిచినవీ చూశా, భూమికి బలం అందించినవీ చూశా.

పలకరించి నీడనిచ్చినవీ చూశా, చెంతకు పిలిచి చల్లదనమిచ్చినవీ చూశా,

చెలిమిగా నిలిచినవీ చూశా, మానవునికి మిత్రులైనవీ చూశా.

చిగురించీ పునర్జీవించినవీ చూశా, పచ్చదనమై పులకరించినవీ చూశా,

వరదల్లో కాపాడినవీ చూశా, వేడిగాలిలో ఆశ్రయమిచ్చినవీ చూశా.

మందులైనవీ చూశా, రోగాలను తగ్గించినవీ చూశా,

దేవతలగా అయినవీ చూశా, పూజలను  స్వీకరించినవీ చూశా.

చెట్లు ః రాళ్లదెబ్బల తిన్నవీ చూశా, గొడ్డళ్లతో నరికినవీ చూశా,

అరచి ఏడ్చినవీ చూశా, కూలి నేలకొరిగినవీ చూశా.

సావాసం నేర్పినవీ చూశా, సేవల చేయమన్నవీ చూశా,

సమాజాన్ని వృద్ధిచేయమనినవీ చూశా, సత్యంగా జీవించమనినవీ చూశా.

చెట్లు ః కవులను కలంపట్టించినవీ చూశా, ఆలోచనలను రేకెత్తించినవీ చూశా,

కవితలుగా మార్పించినవీ చూశా, మనసుల్ని మెలిపెట్టినవీ చూశా.

మౌనంగా మాట్లాడినవీ చూశా, జీవనమూలం అయ్యినవీ చూశా,

మనసులని మృదువుచేసినవీ చూశా ! మానవుని మనిషినిచేసినవీ చూశా!

చెట్లు - త్యాగాలు చేసినవీ చూశా, నరుల స్వార్థ్ధాలను త్రుంచినవీ చూశా,

ప్రకృతిని పరిశుద్ధం చేసినవీ  చూశా, పుడమికి ప్రసన్నత చేకూర్చినవీ చూశా