6 June, 2026 | 3:18 AM

మానవాళి మనుగడకు చెట్లే ఆధారం

06-06-2026 01:23 AM
  1. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
  2. సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 
  3. సింగరేణి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 5 (విజయక్రాంతి): మానవాళి మనుగడకు చెట్లే ఆధారమని,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కేటీకే 8 ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమాలకు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా కేటీకే 8 ఇంక్లైన్ ప్రాంతంలో జీఎం స్వయంగా వెయ్యి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం విశేషంగా మారింది.

ఈ కార్యక్రమంలో జీఎం (క్వాలిటీ) ఆర్జీ రీజియన్ మజుందార్, కేటీకే ఓసీ3 ప్రాజెక్ట్ అధికారి బిక్షమయ్య, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, ఏజీఎం సివిల్ రవికుమార్, ఏరియా రక్షణాధికారి మాటూరి రవీందర్, డీజీఎం క్వాలిటీ కృష్ణ ప్రసాద్, ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఏరియా పర్యావరణ అధికారి పోషమల్లు, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఇతర ఉన్నత అధికారులు, జీఎం ఆఫీస్ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.