6 June, 2026 | 2:38 AM

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

06-06-2026 01:21 AM

మరిపెడ (మహబూబాబాద్), జూన్ 5 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 4వ వార్డులో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు రాము పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో చెట్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కాలు ష్యం, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి భాగస్వా మ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ యాకుబ్ పాషా, స్థానికులు పానుగంటి వెంకన్న, సురే ష్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.