6 June, 2026 | 3:20 AM

అబ్దుల్ నాగారం ఏఈఓగా వినయ్ కుమార్

06-06-2026 01:23 AM

జనగామ, జూన్ 5 (విజయక్రాంతి): సాధారణ బదిలీలో భాగంగా బచ్చన్నపేట మండలంలో ఏఈఓగా పని చేసిన గుగులోతు వినయ్ కుమార్ తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం క్లస్టర్, ఏఈఓగా బదిలీపై వచ్చి శుక్రవారం రోజున బాధ్యతలు చేపట్టారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అందరూ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రైతు నమోదు ద్వారా ప్రభుత్వ పథకాలు అన్నింటికీ అర్హత పొందుతారని అలాగే వానాకాలం కి సంబంధించి రైతులు అందరూ సన్నద్ధం కావాలని, వరి పంటకి గాను సన్న రకాలలో ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు సన్న రకం విత్తనాలు అనుకూలంగా ఉండి మంచి దిగుబడి ఇస్తాయని సూచించారు.