calender_icon.png 11 January, 2026 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి దారిలో పాదయాత్ర

05-01-2026 01:12:06 AM

పవిత్ర గంగా జలానికి మెస్రం వంశీయుల పయనం

ఉట్నూర్, జనవరి 4 (విజయక్రాంతి): ఆదివాసుల ఆరాధ్య దైవం.. ప్రసిద్ధిగాంచిన గిరిజన నాగోబా జాతర ప్రారంభోత్సవానికి అవసరమయ్యే పవిత్ర గంగా జలం కోసం మెస్రం వంశీయుల పాదయాత్ర కొనసాగుతోంది. డిసెంబర్ 30వ తేదీన కేస్లాపూర్ నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర ఆదివారం  కుమ్రంభీం జిల్లా సిర్పూర్ (యు) మండలందనోర గ్రామానికి చేరుకుం ది. గంగా జలం కోసం 101 మంది మెస్రం వంశీయులు చేపట్టిన పాదయాత్రలో ఆదివారం రోజు వరకు 146 మంది పాల్గొన్నా రు.

పాదరక్షలు లేకుండా దాబోలి అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, ముండ్ల పొదలు దాటుకుంటు అటవీ మార్గంలో గంగా జలానికి పయనమవుతున్నారు. కుమ్రంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదివారం పాదయాత్ర చేస్తున్న మెస్రం వంశీయులను కలిసి వారి యోగా క్షేమాల ను అడిగి తెలుసుకున్నారు.

కటోడ మెస్రం హనుమంతరావు, కోసేరావు, ప్రధాన్ దాదా రావు, కొత్వాల్ తిరుపతి మాట్లాడుతూ.. తరతరాలుగా వందల ఏళ్లకు పైగా నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగా జలానికి అడవి దారిలోనే వెళ్తున్నామన్నారు. అడవిలో అడవి జంతువులు కనిపించినా తమ నుంచి దూరం వెళుతున్నాయని వారు సుగు ణ దృష్టికి తీసుకువచ్చారు. దైవ బలమే మిమ్మల్ని నడిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.