calender_icon.png 11 January, 2026 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

05-01-2026 01:10:55 AM

రోడ్లు, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): జనవరి 1 నుంచి 3 వరకు నిర్వహి స్తున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణలో భాగంగా కలెక్టర్, రోడ్డు రవా ణా అధికారులు, ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తమ వంతు సామాజిక బాధ్యతగా రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులకు, నగర ప్రజలకు, ఆటోలకు, వాహనదా రులకు రోడ్లపై ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఆటోలు పరిమితికి మించి ఎక్కువ ప్రయాణికులను తీసుకపోకుండా,  నడక ప్రయాణికుల ఇతర వాహనదారుల ప్రాణాలను కాపాడలని అవగాహన కల్పించారు.

వరంగల్ నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో అనగా ములుగు రోడ్డు, భద్రకాళి ఆర్చ్, ఎంజీఎం సర్కిల్, పోచం మైదాన్, కాశిబుగ్గ సర్కిల్, వెంకట్రామా సర్కిల్, అల్పాహారం హోటల్, లేబర్ కాలనీ 100 ఫీట్ రోడ్, కావేరి వే బ్రీడ్జ్, వరంగల్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్, అండర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్, బాలాజీ నగర్ సర్కిల్, ఏనుమాముల మార్కెట్ గేట్, ఏనుమాముల పోలీస్ స్టేషన్ గేట్, ఏనుమాముల మార్కెట్ రైతు నాగలి బొమ్మ  మొద లగు ప్రాంతాలలో బొమ్మినేని రవీందర్‌రెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సామాజిక బాధ్యతగా పలు ఫ్లెక్సీలు కట్టించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు రోడ్డు నియమాలు పాటించాలన్నారు.