calender_icon.png 11 January, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలి

05-01-2026 01:12:28 AM

మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్

కరీంనగర్, జనవరి 4 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ పరిదిలోని 66 డివిజన్ల ముసాయిదా ఎలక్ట్రోరల్ జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించా లని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ ప్రచురించిన ఎలక్ట్రోరల్ జాబితాపై వచ్చే అభ్యం తరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి, ఎలాంటి లోటు పాట్లు జరగ కుండా డివిజన్, పోలింగ్ బూత్ ప్రకారం మ్యాపింగ్ చేయాలన్నారు. జాబితాను డివిజన్ ఓటర్ల ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని, సరైన పద్దతిలో ఓటర్ జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అధికారులు పాల్గొన్నారు.