13 March, 2026 | 8:13 AM

ఐఐటీలో మెరిసిన గిరిజన ఆణిముత్యం

17-02-2026 04:27 PM

మఠంపల్లి(విజయక్రాంతి): ఐఐటీలో మెరిసిన గిరిజన ఆణిముత్యం సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని బడవతండా గ్రామానికి చెందిన పుడమి స్కూల్ చైర్మన్ భూక్యా బాబు, కరుణా (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)కుమారుడు భూక్యా గిరీష్ రాథోడ్  యావత్ భారతదేశంలో  ఐఐటీ లో 99.60 శాతం మార్కులు సాధించి టాప్ నిలిచారు.

గిరీష్ రాథోడ్ ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పుడమి స్కూల్ భీల్యానాయక్ తండా 9,10 తరగతి జయ స్కూల్ సూర్య పేటలో చదువుకున్నారు. పదవ తరగతి లో 10/10 పాయింట్, ఇంటర్ మొదటి సంవత్సరం లో 470కు 466 మార్కులు సాధించారు. గిరీష్ రాథోడ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందు ఉండేవారని, ఐటీలో టాప్ లో నిలిచిన సందర్భంగా తండా వాసులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.