calender_icon.png 17 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత

17-02-2026 04:24:27 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ఎన్నికయ్యారు , మంగళవారం మున్సిపల్   కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 15 మంది కౌన్సిలర్ల చే ఎన్నికల అథారిటీ అధికారి వీరబుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాంపు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న 12 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎన్నికైన ఒక కౌన్సిలర్, ఒక బీజేపీ కౌన్సిలర్, ఒక బిఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు.

​ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావు ఎక్స్ అఫిషియో సభ్యునిగా హాజరయ్యారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలతను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఘనంగా సన్మానించారు, అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయం ఎదుట గల బిరుదు రాజమల్లు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్  బిందు కృష్ణ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది, పలువురు కృష్ణ ను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు,