పవనసుతుడికి పంచామృతాభిషేకాలు
16-06-2026 04:24 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్లలో గల శ్రీ కోదండ రామాలయంలో కొలువైన ఆంజనేయస్వామికి మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకాలు చేశారు. ఆలయ పూజారి కొలచిన దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తెనే పంచదార, గంధం, వివిధ రకాల పండ్లతో అభిషేకాలు చేసి, వేద ముద్రలతో ఆకు పూజ, పుష్పార్చన పూజలు చేసిన అనంతరం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.






