24 February, 2026 | 7:16 PM

రాజ్యసభకు ఆదివాసీలను ఎంపిక చేయాలి

24-02-2026 05:45 PM

- సాగబోయిన పాపారావు

ఉప్పల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలన- ఇందిరమ్మ రాజ్యం కొనసాగిస్తున్న సందర్భంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎంపికలలోసీనియర్ ఆదివాసి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఎంపిక చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం కార్యనిర్వహణ అధ్యక్షులు సాగబోయిన పాపారావు కోరారు. ఏజెన్సీ నుండి తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం డబ్బులుకు కక్కుర్తి పడకుండా ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని ప్రలోభాలు పెట్టిన లొంగకుంట నీతి, నిజాయితీగా ప్రాణం ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ జెండానే ఊపిరిగా మోస్తున్న ఆదర్శ నేత వీరయ్య అన్నారు.

దీనిగాను మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆదివాసీ యుద్ధ వీరుడు కొమురం భీం జల్, జంగల్, జమీన్ నినాదాన్ని నిత్యం ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్న జంగుబాయి వారసురాలు, ఉద్యమకారిణి ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణక్క పేర్లను  పరిశీలించాలని ఆయన  పేర్కొన్నారు.  దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్న నేటికీ ఆదివాసి తెగల నుండి పెద్దల సభకు ఆదివాసులను పంపించిన దాఖలాలు లేవు, ఈసారి రాజ్యసభకు ఆదివాసులను పంపించి కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణలో ఎన్నిక ఏదైనా షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసి ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ గెలిపించుటలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆదివాసి ప్రజల విశ్వసనీయతకు అనుగుణంగా  నమ్ముకున్న సిద్ధాంతం కోసం గెలిచినా, ఓడిన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆదివాసీ ప్రజలకు ఆదర్శవంతంగా తమ జీవితాలను కొనసాగిస్తున్న పొదెం  వీరయ్య, ఆత్రం సుగుణక్కకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.