12 April, 2026 | 4:24 PM

అందెశ్రీ, సత్యనారాయణరెడ్డిలకు నివాళి

12-11-2025 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అభివృ ద్ధి చెందుతున్న పత్తి పరిశ్రమల స్థాపించుటకు చొరవ చూపి మార్గదర్శనం చేసి, పత్తి పారిశ్రామికవేత్తలను తయారుచేసిన ఆద్యులలో ఒకరైన కరుకాల సత్యనారాయణరెడ్డి ఈ నెల 7న కన్నుమూశారు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాకవి అందెశ్రీ ఈ నెల 10న కన్నుమూశారు.

ఈ సందర్భంగా మంగళవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని కాటన్ యార్డులో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సత్యనారాయణరెడ్డి, అందెశ్రీల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సంతాప సభలో తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్, చాంబర్ మాజీ అధ్యక్షులు కటకం పెంటయ్య, వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం, చాంబర్ సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, కోశాధికారి అల్లే సంపత్, చాంబర్ సంబంధిత అన్ని సెక్షన్ల అధ్యక్ష కార్యదర్శులు, వ్యాపారస్తులు, గుమస్తా, దడువాయి, వివిధ హమాలీలు తదితరులు పాల్గొన్నారు.