12 April, 2026 | 6:06 PM

ఇంజన్‌లో మంటలు.. ట్రావెల్స్ బస్సు దగ్ధం

12-11-2025 12:00 AM
  1. సురక్షితంగా బయటపడ్డ 29 మంది ప్రయాణికులు 
  2. నల్లగొండ జిల్లా వెలిమినేడులో ఘటన

చిట్యాల, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రయాణిస్తున్న బస్సు ఇంజన్‌లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం వద్ద జాతీ య రహదారి 65పై చోటు చేసుకుంది. హై దరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సు (ఎన్‌ఎల్ 01బి3250) వెలిమినేడు గ్రామ సమీపంలోకి రాగానే ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సులో ఉన్న 29 మంది ప్రయా ణికులను కిందికి దింపడంతో అందరు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది.