లింగాపూర్@8.7 డిగ్రీలు
ఏజెన్సీని వణికిస్తున్న చలి
ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం రాష్ట్రంలోనే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లింగాపూర్‌లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జంకుతున్నారు. ఒక్కరోజులోనే 2.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చలి నుంచి రక్షణగా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు శీతాకాలంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండ టమే మేలు అని చెపుతున్నారు.




