కందుకూరి ప్రకాష్ రావుకు ఘనంగా సన్మానం
10-01-2026 06:38 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం వాకర్స్ అసోసియేషన్ ముఖ్య సభ్యులు కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న) జన్మదినాన్ని పురస్కరించుకొని వాకర్స్ అందరూ కలిసి ప్రకాష్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ తోపాటు పెద్ద ఎత్తున వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.






