10-01-2026 06:45:17 PM
కుబీర్,(విజయక్రాంతి): ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలని తెలంగాణ తెలుగు కళానిలయం అధ్యక్షులు, కవి జాధవ్ పుండలిక్ రావు పాటిల్ కోరారు. మన పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతికలు ఇటువంటి పండుగలా ఔన్నత్యాన్ని తెలియజేయటానికి కవి సమ్మేళనాలు దోహదపడతాయని, మరోవైపు తెలుగు భాష పరిరక్షణకు కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల్లో తెలుగు మాధుర్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడానికి కవి సమ్మేళనాలు ఉపయోగపడుతాయి. ఇప్పటికైనా ఆకాశవాణి అదిలాబాద్ కేంద్రం అధికారులు కవి సమ్మేళనాలకు శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు.