3 March, 2026 | 3:54 PM

దివంగత స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి

03-03-2026 12:14 AM

మేడ్చల్, మార్చి 2(విజయ క్రాంతి): శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా యువజన & క్రీడా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరే ట్ లో ఘనంగా నివాళులర్పించారు.ఈ సం దర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంత రం మాట్లాడుతూ శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీ పాదరావు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డి ఆర్ ఓ, చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.