14-11-2025 05:00:58 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉట్కూరి సత్యనారాయణ గౌడ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘట్ కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ లు సత్యనారాయణగౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘట్ కేసర్ మున్సిపల్ లోని కొండాపూర్ గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా సేవలoదిoచిన ఉట్కూరి సత్యనారాయణగౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా డీసీసీ ఉపాధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడని ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. మాజీ వార్డు సభ్యులు బొంత వెంకటేష్, ఎస్సీ సెల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి మేకల కుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫరూఖ్ భాయ్, జిల్లా కార్యదర్శి ఎం.ఎ. రెహ్మాన్, ఎల్. లక్ష్మీ నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.