14-11-2025 04:59:18 PM
మిడ్జిల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎల్లికంటి పరుశురాములు తన వ్యవసాయ పొలంలో చేనుకు పైపులు మారుస్తుండగా 11 కెవి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో గమనించిన పక్కన వ్యవసాయ పొలంలో ఉన్న రైతు శాంతయ్య తన దగ్గర ఉన్న టవల్ తో పక్కకు లాగాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక రైతులు విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపారు.