18 March, 2026 | 3:51 PM

అమరవీరులకు నివాళి

14-12-2025 01:29 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౩:ముష్కర మూకలు ఢిల్లీ పార్లమెంట్‌పై దాడి చేసిన ఘటనకు ౨౪ ఏళ్లు పూర్తయ్యాయి. నాడు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది అసువులు బాశారు.

వీరి స్మారకంగా పాత పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద ఆదివారం ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, అర్జున్ రామ్ మేఘవాల్ నివాళి అర్పించారు. కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ సహా రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా హాజరయ్యారు.