ఉన్నత విద్యపై ఒకే నియంత్రణ వ్యవస్థ
- యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ స్థానంలో ఒకే విభాగం
‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్’ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశంలో ఉన్నత విద్యపై నియంత్రణ వ్యవస్థలైన విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీ ఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) స్థానంలో ఒకే నియంత్రణ వ్యవ స్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే ప్రతిపాదించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌ఈసీఐ) బిల్లుకు తాజాగా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
బిల్లుకు ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్’ అని నామకరణం చేసింది. వైద్య, న్యాయ విద్యను మినహాయిం చి, మిగిలిన అన్ని ఉన్నత విద్యా రంగాలు కొత్త వ్యవస్థ పరిధిలోకి రానున్నాయి. ఈ వ్యవస్థకు మూడు ప్రధాన బాధ్యతలు ఉం టాయి. అవి క్రమబద్ధీకరణ, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని ఈ వ్యవస్థకు ఉండదని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వమే విద్యాసంస్థలకు నిధులు విడుదల చేస్తుందని సమాచారం.




