1 July, 2026 | 8:55 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పింగిళి కళాశాలలో పహేల్గాం మృతులకు అశ్రు నివాళి!

30-04-2025 12:00 AM

ప్రిన్సిపాల్ లెఫ్ట్‌నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి

హనుమకొండ, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా  కళాశాల (స్వయంప్రతిపత్తి) హనుమకొండ, పహెల్గామ్ లో ఉగ్రవాద దాడిలో మరణించిన భారత పర్యాటకులకు  అశ్రునివావాళి అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల ఎన్ సి సి విభాగం ఆద్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెన్ట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి  మాట్లాడుతూ ఇటీవల కాశ్మీర్‌లోని పాహెల్గాంలో అమాయకులైన 28 మంది భారత పర్యాటకులను ఉగ్రవాదులు అత్యంత  కిరాతకంగా హతమార్చడం హేయ మైన చర్య అని, పాశవిక మైందని దీనిని ముక్తకఠంతో ఖండిస్తూ మృతులకు నివాళి అర్పిస్తున్నా మనీ, మృతుల  కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామనీ అన్నారు.

ఈ సంఘటనను ఖండిస్తూ కళాశాల అధ్యాపకులు రేణుక, రత్నమాల, ఎన్ సి సి క్యాడెట్లు దీక్షిత, వెంకటలక్ష్మి, కృష్ణవేణి ఈ పాశవికమైన చర్యను ఖండిస్తూ, నిరసన వ్యక్తం చేస్తూమాట్లాడారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, ఎన్ సి సి కేర్ టేకర్ డా. బి.సువర్ణ , ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ డా.సురేశ్ బాబు, అధ్యాపకులు సుజాత, మధు, ప్రవీన్ కుమార్, రాజేశ్వరి, సునీత, రాంరెడ్డి, రమేష్, బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్ సి సి కాడెట్లు, కళాశాల  విద్యార్థులు పాల్గొన్నారు.