21 March, 2026 | 7:53 AM

త్రిణయ ఆరోగ్య కేంద్రం

21-03-2026 12:00 AM

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం 

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): 120 ఏళ్ల అపూర్వ వైద్య వారస త్వాన్ని కలిగిన ఆర్య వైద్యశాల, కొట్టక్కల్ హైదరాబాద్.. బంజారాహిల్స్‌లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన తన ఆధునిక ఆరోగ్య విభాగం త్రిణయ  ఆ రోగ్య, చికిత్స కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే నవీన్‌యాదవ్ ప్రారంభించారు.

ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకాగా, ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ డా. పి.ఎం. వారియర్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి కె. హరికుమార్, డా. కె. మురళీధరన్, ఆయుర్వేద ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం సూపరింటెండెంట్ మనోహర్ బండ్ల, వై యు పి రైట్కేర్ ప్రతినిధి పి.ఎస్. వరప్రసాద్ పాల్గొన్నారు. సంప్రదాయ ఆయుర్వేద సిద్ధాంతాలను ఆధునిక జీవనశైలితో సమన్వయం చేస్తూ రూపుదిద్దుకున్న ఈ ‘త్రిణయ’ కేంద్రం, ఆరోగ్య సంరక్షణలో సమగ్ర దృష్టిని ప్రతిబింబిస్తోంది.

ఈ కేంద్రంలో అభ్యంగ, శిరోధార, పిళిచిల్, కిళి, నస్యం వంటి సాంప్రదాయ చికిత్సలు అందుబాటులో ఉండి, ఒత్తిడి నియంత్రణ, శరీర శుద్ధి, పునరుజ్జీవనం వంటి సేవలను సమగ్రంగా అందిస్తున్నాయి. చర్మం, కేశ సంరక్షణలో కూడా ప్రామాణిక ఆయుర్వేద చికిత్సలు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత. త్రిణయలో అందించే అన్ని వైద్య సేవలు ఆర్య వైద్యశాల తయారీ యూనిట్లలో తయారైన ప్రామాణిక ఔషధాల ఆధారంగా నిర్వహించబడుతున్నాయి.