2 July, 2026 | 1:17 AM

ఫీచర్ ఫిల్మ్‌గా వనజీవి రామయ్య

02-07-2026 12:20 AM

వనజీవి దరిపల్లి రామయ్య సేవలను వివరిస్తూ రూపొందిన లఘుచిత్రం ‘వనజీవి రామయ్య’ ఇప్పుడు పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీటీమ్ సమక్షంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పర్యా వరణ పరిరక్షణ పాటుపడుతున్న స్వచ్ఛంద సేవకులను సత్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, వాస్విక్ గ్రూప్ చైర్మన్ నిడిగొండ నరేశ్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య’ను పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లె ప్రకృతి వానలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని కూడా ఈ వేదిక నుంచి ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమానికి వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్‌రెడ్డి, దర్శకుడు వేముగంటి నాయకత్వం వహించారు. మొక్కల సత్యనారాయణ, మొక్కల వెంకటయ్య,హీరోయిన్ నాగరాణి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్, వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు, సాహిత్య, సామాజిక రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.