23 June, 2026 | 2:44 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

త్రిబుల్‌ఆర్ బాధిత రైతుల ధర్నా

09-09-2025 01:03 AM

పరిహారం ఇవ్వాలని డిమాండ్

సనత్‌నగర్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద ట్రిపుల్‌ఆర్ ప్రాజెక్ట్ బాధిత రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తమ భూములకు తగిన పరిహారం అందకుండా అన్యాయానికి గురవు తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు.

రైతులు మాట్లాడుతూ ‘మన పారంపర్య భూములను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నా, ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాసం ఇవ్వలేదు. సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినా అమలు కాలేదు. మాకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు. హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు నినాదాలు చేస్తూ డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు.