09-09-2025 01:01:46 AM
వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా వరంగల్ మెడికవర్ హాస్పిటల్ వారు జయ నర్సింగ్ కాలేజీలో సోమవారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు డా.అజయ్, డా.మౌని క పాల్గొన్నారు.
కాలేజీ ప్రిన్సిపాల్ ప్రియోబాల, అసోసియేట్ ప్రిన్సిపాల్ సుధారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి నర్సింగ్ విద్యార్థులకు ఫిజియోథెరపీ ప్రాధాన్యతను, ఆసుప త్రుల్లో దాని ఉపయోగాలను వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోగుల పునరావాసంలో ఫిజియో థెరపీ కీలక పాత్ర పోషిస్తుందని, రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు.