విజయ్ ఇంటికి త్రిష
టీవీకే ప్రభంజనంపై అభినందనలు
చెన్నై, మే ౪: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించిన నేపథ్యంలో నటి త్రిష్ సోమవారం ఆయన ఇంటికి చేరుకుని సంబురాల్లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆమె విజయ్ ఇంటికి వచ్చారు. ఇదే రోజు జన్మదినం కావడంతో తెల్లవారుజామునే ఆమె తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా చేరుకున్నారు.
సరాసరి విజయ్ ఇంటికి వచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ ఇంటి లోపలికి వెళ్లారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై కొంతకాలం నుంచి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. 2023 లో వచ్చిన ‘లియో’ సినిమాలో వీరు చివరిగా కలిసి నటించారు. విజ య్ భార్య సంగీత నుం చి విడాకుల కోసం కో ర్టును ఆశ్రయించిన నేపథ్యంలో త్రిష ఆయనతో సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశమైంది. తాజా రాజకీయ పరిణామాల మధ్య త్రిష అంశం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.






