15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా త్రివేణి విద్యా సంస్థల ‘ఫన్ ఫెస్ట్’

21-02-2026 12:18 AM

విద్యార్థుల ప్రతిభా పాటవాల సందడి

హైదరాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాం తి): నగరంలోని పీవీఆర్ గార్డెన్స్ వేదికగా త్రివేణి విద్యాసంస్థల నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షికోత్సవం ‘ఫన్ ఫెస్ట్’ అత్యంత వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు, చిన్నారుల కేరింతల మధ్య ఈ కార్యక్రమం కనుల పండువగా సాగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ హెచ్‌ఆర్‌అండ్ మైండ్ మేనేజ్‌మెంట్ నిపుణులు వంగీపురపు రవికుమార్ ప్రసంగిస్తూ విద్యార్థులు చిన్నతనం నుంచే మానసిక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

త్రివేణి విద్యా సంస్థలు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీ స్తూ, వారిని భావి భారత విజేతలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని ఆయన కొనియా డారు. తల్లిదండ్రులు పిల్లల మానసిక వికాసానికి తోడ్పడాలని సూచించారు. సంస్థల సెం ట్రల్ సైన్స్ ఆఫీసర్ (సీఎస్‌ఓ)సుబ్బారావు మాట్లాడుతూ ‘త్రివేణి విద్యాసంస్థల్లో గత 32 సంవత్సరాలుగా కొనసాగుతున్న మా ప్రయా ణం ఎంతో సంతృప్తిని ఇస్తోంది.

నర్సరీలో అడుగుపెట్టిన చిన్నారి పదవ తరగతికి వచ్చేసరికి ఒక సంపూర్ణ వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగేలా మేము అందిస్తున్న శిక్షణ ఈరోజు ఈ ఫన్ ఫెస్ట్ వేదికపై ప్రతిబింబిస్తోం ది’ అని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల నమ్మకానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో త్రివేణి సంస్థ సీఆర్‌వో వెంకట్రావు, ప్రిన్సిపాల్ శివకీర్తన, వైస్ ప్రిన్సిపాల్ నళిని, ఉపాధ్యాయ బృందం, పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ఈ ఫన్ ఫెస్ట్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. నర్సరీ చిన్నారుల ముద్దుముద్దు మాటలు, దేశభక్తిని చాటిచెప్పే నృత్య రూపకాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.