21 August, 2026 | 7:52 PM

24వ వార్డులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

21-08-2026 07:03 PM

టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవరావు నాయక్ 

కోదాడ,(విజయ క్రాంతి): కోదాడ పట్టణంలోని 24 వ వార్డులో తెలంగాణ రక్షణ సేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవరావు నాయక్  శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం మహిళల ఆర్థిక స్వలంబన  కోసం  టిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.

అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలు సభ్యత్వం  నమోదు చేయాలన్నారు మండల కమిటీలు గ్రామ కమిటీలు త్వరలో పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఏనుగులల్లేశ్వరరావు శైలజ కోదాడ మండలం ఉపాధ్యక్షులు పాముల శివ భూక్య గణపతి తోట శ్రీనివాసరావు గొట్టుముక్కల శ్రీనివాసరావు బిక్ష నాయక్ చాపల ఎంకన్న తదితరులు పాల్గొన్నారు