భూపాలపల్లిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం చేసిన మహిళలు
21-08-2026 07:01 PM
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కలని, రాంనగర్ కాలనీలలో మహిళలు అందరు కలిసి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం కార్యక్రమం చేశారు. వ్రతం అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనం ఇచ్చి పుచ్చుకున్నారు. భార్య, భర్తలు సుఖ సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఈ సందర్భంగా మహిళలు అందరు లక్ష్మీదేవిని కోరుకున్నారు.






