12 July, 2026 | 12:35 PM

ట్రంప్‌తో ట్రూడో భేటీ

02-12-2024 03:20 AM

కెనడా దిగుమతులపై చర్చ

వాషింగ్టన్, డిసెంబర్ 1: అధికారంలోకి రాగానే కెనడా దిగుమతులపై భారీగా సుం కాలు విధిస్తానని చెప్పిన అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సమావేశమయ్యారు. ట్రంప్ కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఎస్టేట్ వేదికగా ఇద్దరు నేతలు వివిధ అంశాలపై చర్చించారు.  ఈ భేటీ వివరాలను ‘ట్రూత్’లో ట్రంప్ పోస్ట్ చేశారు. ట్రూడోతో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి తీసుకోవాల్సిన అనేక అంశాలపై చర్చించామని తెలిపారు.

కెనడా నుంచి అక్రమ వలసలు, ఫెంటానిల్ డ్రగ్ స్మగ్లింగ్, దిగుమతుల అంశాలపై చర్చించామన్నారు. అమెరికా కార్మికులకు నష్టం కలిగించే అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలి పారు. అమెరికాతో కలిసి పనిచేయడానికి ట్రూడో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలా గే ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్రూడో పేర్కొన్నారు. బాధ్యతలు తీసుకోగానే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.