12 July, 2026 | 1:41 PM

బంగ్లాలో మహిళా జర్నలిస్ట్‌కు వేధింపులు

02-12-2024 03:25 AM

ఇండియా ఏజెంట్ అంటూ బెదిరింపులు

ఢాకా నడిబొడ్డున ఉదంతం

ఢాకా, డిసెంబర్ 1: బంగ్లాదేశ్‌లో అల్లరిమూక ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ వుతున్నాయి. మున్నీ సాహా అనే మహిళా జర్నలిస్ట్ కారును అడ్డగించి నిర్బంధించారు. మున్నీ శనివారం ఢాకాలోని తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా దుండ గులు కారును చుట్టుముట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను భారత్ ఏ జెంట్‌గా అభిర్ణిస్తూ దుర్భాషలాడారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని ఆమెను ముందుగా తేజ్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనం తరం ఆమెను మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాం చ్‌కు తరలించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలను అధికారులు కొట్టిపారేశారు. అల్లరిమూక దాడి చేయడంతో ఆమె భయాందోళనలకు గురైందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయమే మున్నీని వదిలిపెట్టినట్టు వెల్లడిం చారు. అయితే ఆమె నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్టు చెప్పారు. బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో బంగ్లాలో జర్నలిస్ట్‌లపై ఈ తరహా దాడులు పెరిగాయి.