24 August, 2026 | 11:39 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

భక్తిశ్రద్ధలతోనే సుఖసంతోషాలు

14-05-2026 12:26 AM

బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్జి మహేందర్‌రెడ్డి

జవహర్ నగర్, మే 13 (విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతోనే సుఖసంతోషాలు కలుగుతాయని, శివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జీ మహేందర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురికాలనీ డివిజన్లోని బృందావన్ కాలనీలోని దేవాలయంలో లింగ పునప్రతిష్టాపన, ధ్వజస్థంభోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జీ చామకూర మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద వితరణను బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, నాయకులు రాజశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.