15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి

21-02-2026 02:06 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి) : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం  తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి  సేవలు అమోఘమ ని, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే  లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.  దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ 57 వ డివిజన్ కార్పొరేటర్ ఎం.ప్రవీణ్ కుమార్, నాయకులు టాంకర కృష్ణయ్య యాదవ్, మైత్రి యాదయ్య, లీడర్ రఘు, ఎం.రాఘవేందర్ , తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సేవా సంస్థ ప్రతినిధి ఎదిర ప్రమోద్ కుమార్ తో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.