calender_icon.png 21 February, 2026 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు: ఎమ్మెల్యే

21-02-2026 02:08:06 AM

నవాబ్ పేట్, ఫిబ్రవరి 20: ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కరూర్, కొండాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను శుక్ర వారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే  లబ్ధిదారుల ఇండ్లను పరిశీలించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా కృషి కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, నవాబ్ పేట్ మండల అధ్యక్షుడు రామచంద్రయ్య, మార్కెట్ చైర్మన్ హరి లింగం, వైస్ చైర్మన్ తులసీ రామ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నీలకంఠం, కరూర్ సర్పంచ్ ఏరోళ్ల శంకరయ్య పాల్గొనారు.