18 April, 2026 | 1:03 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా

18-04-2026 11:20 AM

తిరుపతి: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌పై( Prakash Raj) పరువు నష్టం దావా దాఖలైంది. టీటీడీ(Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ప్రకాష్ రాజ్‌పై పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వారంలో క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ వేదికపై వి ద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసులో వెల్లడించారు. ఇటీవల కేరళలో జరిగిన కార్యక్రమంలో సీతారామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.