29 June, 2026 | 2:02 AM

అల్లాడి వీరేశానికి తులాభారం

29-06-2026 12:00 AM

ఆశీర్వదించిన పీఠాధిపతులు 

జహీరాబాద్, జూన్ 28 : జహీరాబాద్ పట్టణంలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి అల్లాడి వీరేశంకు భీమారతి శాంతి సహిత తులాభార మహోత్సవం నిర్వహించారు. ఆదివారం రంజోల్ శుభం ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జరా సంఘం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర నందగిరి మహారాజ్ ఆశీర్వదించారు. కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానికిరావు, జహీరాబాద్ ప్రముఖ వస్త్ర వ్యాపారులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు.