9 April, 2026 | 6:31 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ద్వుపాక్షిక సంబంధాలపై తుర్కియె ఆసక్తి

30-11-2024 12:55 AM

ఆ దేశ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణతో ద్వుపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె దేశపు రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరస్పర సహకారంపై మంత్రి, తుర్కియె రాయబారి చర్చించారు.

తుర్కియె, తెలంగాణ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సెన్సైస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి వెల్లడించారు. భేటీలో తుర్కియె కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యమన్ ఓకన్ కూడా పాల్గొన్నారు.