29 June, 2026 | 10:13 PM

జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

29-06-2026 09:02 PM

- భద్రాచలం ఎమ్మెల్యే డా. వెంకట్రావు 

- ఘనంగా టియుడబ్ల్యుజె (ఐజెయూ) భద్రాచలం డివిజన్ మహాసభ

భద్రాచలం,(విజయక్రాంతి): సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని రాఘవ నిలయం ( రెడ్డి సత్రం) నందు జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యుజె - ఐజెయూ) భద్రాచలం డివిజన్ మహాసభ ఆ యూనియన్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బి. వి. రమణారెడ్డి,జిల్లా అధ్యక్షులు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జునుమాల రమేష్ ల సమక్షంలో విజ్జిగిరి రాజా కిరణ్ సభాక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం రంగంలో పనిచేస్తున్న విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమ కార్యక్రమాల అమలుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 

- ఘనంగా టియుడబ్ల్యుజె (ఐజెయూ) భద్రాచలం డివిజన్ మహాసభ

అనంతరం యూనియన్ భద్రాచలం డివిజన్ మహాసభ జరిగింది. అధ్యక్షుడిగా భూక్య రంజిత్ నాయక్, ఉపాధ్యక్షులుగా బండారి మహేష్ యాదవ్, కాటా సత్యం, పందేలపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా పరుచూరి రవీంద్రబాబు, సహాయ కార్యదర్శులుగా షేక్ ఖాసిం, పసుపులేటి బాబు, కోశాధికారిగా బొల్లె రాంబాబు, కార్యవర్గ సభ్యులుగా విజయ్, బోళ్ళ వినోద్, సతీష్, వాకచర్ల శ్రీనివాసరావు, అనిల్, వెంకట్, గోసుల వెంకటేశ్వరరావులు ఎంపికయ్యారు.

అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా శ్రీహరి, TV5, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, Q news, పాకాల శివగౌడ్,SD News, కార్యదర్శిగా జయరాం, 10 TV, సహాయ కార్యదర్శిలుగా కాసబోయిన మోహన్ రావు, Prime News,  జెట్టి రామకృష్ణ, TV999, కోశాధికారిగా బాల కిరణ్, Abn, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అన్వేష్ రెడ్డి, R Tv,కార్యవర్గ సభ్యులుగా రామ లక్ష్మణ్, జగన్ 8tv లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి జిల్లా,అధ్యక్ష కార్యదర్శులు, పలువురు ప్రముఖులు, భద్రాచలం డివిజన్ లోని మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్ లో యూనియన్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కార్యవర్గం కృషి చేయాలని సూచించారు.