17 July, 2026 | 8:42 PM

Breaking News

భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •  

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వ నమోదు

18-05-2026 12:11 AM

చిట్యాల, మే 17 : నార్కట్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్  సభ్యత్వ నమోదు కార్యక్రమం ను ఆదివారం నిర్వహించారు. పాత్రికేయుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభ్యత్వ నమోదు మహోత్సవంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనలో, వారి సంక్షేమ కార్యక్రమాలను ముందంజలో ఉంచడంలో యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ సభ్యత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత్రికేయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు ఐక్యతతో మెదలాలని, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా వార్తా కథనాలను అందించాలని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన టీయూడబ్ల్యూజే సభ్యులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి  మహేందర్ రెడ్డి, యేళ్ల భయన్న, దేవరశెట్టి నారాయణ,  బాశెట్టి శ్రీనివాస్, పసునూరి చంద్రశేఖర్, ప్రజ్ఞాపురం శివశంకర్, ప్రజాపురం కృష్ణ, బండారు రాంబాబు, పల్లి తిరుమల్,  రాధారపు రమేష్, సోమ వెంకటరెడ్డి, మంద చంటి, గర్దాస్ వెంకటేశ్వర్లు, సిరిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.