17 July, 2026 | 8:33 PM

Breaking News

పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •  

ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

18-05-2026 12:10 AM

ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

చిట్యాల, మే 17 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంపై తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు, గృహ, విద్యా, వైద్య రంగాల్లో ఉద్యమకారులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించి శాశ్వత విధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జోగు లింగస్వామి, కొసనం అశోక్ యాదవ్,బాస్పాజు రామాచారి, అమరోజు వెంకన్న, జిల్లాపల్లి స్వామి, జోగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.