16 July, 2026 | 11:17 AM

వాయునాళంలో 8 ఏళ్లుగా పావలా బిళ్ల

04-07-2024 01:17 AM

విజయవంతంగా తొలగించిన బీహెచ్‌యూ వైద్యులు

వారణాసి, జూలై 3: ఎనిమిది ఏళ్లు గా ఓ వ్యక్తి వాయునాళంలో ఇరుక్కుపోయిన 25 పైసల నాణేన్ని అరుదైన శస్త్రచికిత్స ద్వారా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) వైద్యులు విజయవంతంగా తొలగించారు. కార్డియో సర్జన్ ప్రొఫెసర్ సిద్ధా ర్థ్ లఖోటియా, ప్రొఫెసర్ మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం 20 నిమిషాలు కష్టపడి విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది. సాధారణంగా దగ్గినప్పుడు ఇలాంటివి తెలియకుండా జరిగే అవకాశముంటుందని లఖోటి యా తెలిపారు.

ఎక్కువగా చిన్నపిల్ల ల్లో ఇలా జరుగుతుందని వివరించా రు. కానీ ఓ 40 ఏళ్ల వ్యక్తికి ఇలా జరగడం అరుదుని పేర్కొన్నారు. వీటిని గుర్తించకపోవడం వల్ల ప్రాణాప్రాయ పరిస్థితులు ఎదురవుతాయని, న్యూ మోనియా, ఊపిరితిత్తులు పాడవడం వంటి వ్యాధులు వస్తాయని తెలిపా రు. ఇటీవలే ఓ వ్యక్తికి వాయునాళం లో పదేళ్లుగా చిక్కుకుపోయినా ఆల్మా రా తాళాన్ని బీహెచ్‌యూ వైద్యులు తొలగించడం గమనార్హం.