24 June, 2026 | 8:38 PM

23,700 శ్రేణిలో నిఫ్టీ

10-06-2024 12:05 AM

వీక్లీ చార్టుల్లో నిఫ్టీ హ్యాంగింగ్ మ్యాన్ తరహా క్యాండిట్‌స్టిక్ ప్యాట్రన్‌ను కనపర్చిందని, రెలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్‌లో నెగిటివ్ డైవెర్జన్స్ ఏర్పడిందని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ సుదీప్ షా విశ్లేషించారు. ఈ కారణంగా ఈ వారం ట్రేడర్లు లివరేజ్డ్ పొజిషన్లను పెంచుకోరాదని, షేర్ ధరల్ని ఛేజ్ రాయవద్దని సూచించారు. తగ్గినపుడు కొనవచ్చని సూచించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా ప్రకారం నిఫ్టీ 23,700 వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కోవచ్చని, 22,500 పాయింట్ల సమీపంలో మద్దతు ఉన్నదని, ఆ రెండు స్థాయిల మధ్య సూచి హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 23,700 పాయింట్ల వద్ద అధికస్థాయిలో కాల్ రైటింగ్ జరిగిందని, ఆ దిగువన 23,500 స్ట్రుక్ వద్ద గరిష్ఠంగా కాల్ రైటింగ్ కన్పిస్తున్నదని తెలిపారు. అధికంగా పుట్ ఓపెన్ ఇంట్రస్ట్ 23,000, 22,800 స్ట్రుక్స్ వద్ద ఉన్నదని పేర్కొన్నారు.