ఐటీ రిటర్న్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయకండి
బ్యాంక్ అకౌంట్ ప్రిఊ ఎందుకు?
ఆదాయపు పన్ను శాఖ సమాచారం ప్రకారం ట్యాక్స్ రిఫండ్ కేవలం ముందుగా వ్యాలిడేట్ చేసిన బ్యాంక్ ఖాతాలోనే జమచేస్తారు. అలాగే ప్రి బ్యాంక్ ఖాతాను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు ఈ కోసం ఈవీసీని ఎనేబుల్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు, ఇతర ఫారాలు జతచేయడం, ఈ రిఫండ్ రీఇష్యూ, రీసెట్ పాస్‌వర్డ్, ఈ అకౌంట్ సెక్యూర్డ్ లాగిన్‌లకు కూడా ఈ ప్రిన చేసిన బ్యాంక్ ఖాతాద్వారా చేసుకోవచ్చు.
ప్రిా విఫలమైతే..
ప్రి రిక్వెస్ట్ స్టాటస్‌ను ట్యాక్స్‌పేయర్ మొబైల్ నంబరుకు, ఈ పోర్టల్‌లో రిజిష్టర్ అయిన ఈమెయిల్ ఐడీకి ఐటీ శాఖ పంపిస్తుంది. వ్యాలిడేషన్ విఫలమైతే అందుకు సంబంధించిన వివరాలు ఆయా బ్యాంక్ ఖాతాల్లో డిస్‌ప్లే అవుతుంది. అలా ఫెయిల్ అయిన బ్యాంక్ ఖాతా ప్రి కోసం రీ చేయవచ్చు. ఫెయిల్డ్ బ్యాంక్ ఖాతాల సెక్షన్‌లో ఆ బ్యాంక్ రీ కోసం క్లిక్ చేయాలి.
బ్యాంక్ వద్ద రిజిష్టర్ అయిన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ మారితే..
బ్యాంక్ వద్ద రిజిష్టర్ అయిన మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ మారినట్టయితే ఐటీ వెబ్‌సైట్‌లో మీ యాడడ్ బ్యాంక్ అకౌంట్స్ సెక్షన్‌లో మార్పు జరిగిన కాంటాక్ట్ డిటైల్స్ (మొబైల్ నంబరు/ఈమెయిల్ ఐడీ) వద్ద వార్నింగ్ సింబల్ కన్పిస్తుంది. అలాంటి సందర్భంలో మీ బ్యాంక్ ఖాతాలో రిజిష్టర్ అయిన వివరాలతో మ్యాచ్ అయ్యేలా మీరు మీ ఈ పోర్టల్‌లో మీ కాంటాక్ట్ వివరాల్ని అప్‌డేట్ చేసుకోవాలి. లేదా బ్యాంక్ ఖాతాలో ఉన్న మొబైల్/ఈమెయిల్ ఐడీలను అప్‌డేట్ చేయాలి. ఈ వివరాలు అప్‌డేట్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాను రీవ్యాలిడేట్ చేసుకోవచ్చు.
ఎంత సమయం పడుతుంది..
ప్రి ప్రాసెస్ ఆటోమ్యాటిక్‌గా జరిగిపోతుంది. ఈ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయగానే దానిని మీ బ్యాంక్‌కు పంపుతుంది. 10 పనిదినాల లోపుగా మీ ఈ ఖాతాలో వ్యాలిడేషన్ స్టాటస్ అప్‌డేట్ అవుతుంది.
అసెస్‌మెంట్ సంవత్సరం 2024 (2023 ఆర్థిక సంవత్సరం) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) వేయడానికి చివరితేదీ జూలై 31. వేతనాలు అందుకునే ట్యాక్స్ పేయర్లు వారి యాజమాన్యాలు జారీచేసే ఫారం 16 కోసం వేచిచూస్తుంటారు. ఈ కీలక డాక్యుమెంట్‌లోనే ట్యాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), దానిని పన్ను శాఖలకు చెల్లించిన వివరాలు ఉంటాయి. సాధారణంగా కంపెనీలు సాధారణంగా ఫారం 16ను ప్రతీ ఏడాది జూన్ తొలి లేదా రెండవ వారాల్లో జారీచేస్తుంటాయి. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసేటపుడు ఫారం 16తో సహా అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఫైల్ చేసేముందు మీరు కొన్ని టాస్క్‌లను పూర్తి చేసుకోవాలి. అందులో ఒకటి మీ బ్యాంక్ ఖాతాలను ప్రి చేయడం. అలా చేస్తేనే టాక్స్ రిఫండ్స్ అందుతాయి.
ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫారాలు
ఆదాయపు పన్ను శాఖ ఈ పోర్టల్‌లో ఆన్‌లైన్ ఇన్‌కం ట్యాక్స్ 2023 ఆర్థిక సంవత్సరానికి (2024 అసెస్‌మెంట్ సంవత్సరం) రిటర్న్ ఫారంలు 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4లను ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఈ ఫారాలు ఉపయోగించి వారి ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేసుకోవచ్చు.
ఇంతకు ముందుగా ఐటీ శాఖ ఈ మూడు ఫారాల ఆఫ్‌లైన్ ఎక్సెల్ యుటిలిటీస్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 6 ఆఫ్‌లైన్ జేసన్ యుటిలిటీస్‌ను సైతం విడుదల చేసింది. 2023 ఆర్థిక సంవత్సరానికి (2024 అసెస్‌మెంట్ సంవత్సరం) ఐటీ రిటర్న్‌లు సమర్పించేందుకు చివరితేదీ 2024, జూలై 31.
డేటా సరిచూసుకోండి
ఈ పోర్టల్‌లో ట్యాక్స్ పేయర్ తన అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి, ‘ఫైల్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్’ ఆప్షన్‌ను క్లిక్‌చేసి, రిటర్న్‌ను పూర్తిగాఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. ట్యాక్స్ పేయర్ యాన్యువల్, ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారం 26ఏఎస్‌లో ఉన్న డేటా అంతా ముందుగానే వారి ఫారంలో ఫిల్ అయ్యి ఉంటుంది. ఆ డేటాను పన్ను చెల్లింపుదారులు వారి ఫారం 16, ఫారం 16ఏ, ఇతర టీడీఎస్ సర్టిఫికెట్లు, బ్యాంక్ ఇంట్రస్ట్ సర్టిఫికెట్లు, సేలరీ స్లిప్స్ తదితర డాక్యుమెంట్స్ ద్వారా క్రాస్‌చెక్ చేసుకుని, రిటర్న్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అయితే పలువురు ఉద్యోగులు వారి టీడీఎస్ సర్టిఫికెట్లును పొందడానికి జూన్ నెల చివరివరకూ వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.






