30 June, 2026 | 8:36 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

టి ట్వంటీ ప్రపంచ కప్

05-06-2024 12:58 AM

అఫ్గాన్ శుభారంభం

ప్రొవిడెన్స్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ భాగంగా పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ సేన 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్థశతకాలతో చెలరేగి భారీ స్కోరుకు బాటలు వేశారు. నబీ (14 నాటౌట్) పర్వాలేదనిపించాడు. ఉగాండా బౌలర్లలో కాస్మాస్ కెవుటా, మసాబాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేధనలో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండా ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. రాబిన్‌సన్ ఒబుమా (14), రియాజత్ అలీ షా (11) మాత్రమే రెండెంకల స్కోరు చేయగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరుఖీ 5 వికెట్లతో చెలరేగగా.. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఉగాండా పతనాన్ని శాసించిన ఫరుఖీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు.

వర్షం అంతరాయం

బ్రిడ్జ్‌టౌన్:  టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర పోరు జరుగుతున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలిపోరులో స్కాట్లాండ్‌పై గెలిచి ఘనంగా బోణీ కొడదామనుకుంటే వరుణుడు అడ్డుకున్నాడు. మెగాటోర్నీలో భాగంగా మంగళవారం గ్రూప్ భాగంగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ బ్యాటింగ్ ఏంచుకుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే సమయానికి స్కాట్లాండ్ 6.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. విరా మం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. స్కాట్లాండ్ ౧౦ ఓవర్లలో ౯౦ పరుగులు చేసింది.