30 June, 2026 | 7:27 PM

అర్జున్ @ 5

05-06-2024 01:00 AM

న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి చరిత్ర సృష్టించాడు. మంగళవారం విడుదలైన ఫిడే చెస్ లైవ్ ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఐదో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం భారత్ తరపున లైవ్ రేటింగ్‌లో అత్యుత్తమ ర్యాంక్ పొందిన ఆటగాడిగా అర్జున్ నిలిచాడు. అర్జున్ తన ఖాతాలో 2679.7 ఎలో రేటింగ్ పాయిం ట్లు కలిగి ఉన్నాడు.  విశ్వనాథన్ ఆనంద్ తర్వాత లైవ్ రేటింగ్‌లో అత్యుత్తమ స్థానం సాధించిన ఆటగాడిగా అర్జున్ నిలిచాడు.