calender_icon.png 3 October, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

03-10-2025 11:00:09 AM

తుంగతుర్తిలో అలుముకున్న విషాద ఛాయలు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (మం) బండరామారం ఎక్స్ రోడ్డు వద్ద గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అదుపుతప్పిన బైక్ చెట్టుకు ఢీకొనగా,తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి వేముల నాగరాజు (26), వేముల కార్తీక్ (24) ఇరువురు మృతి చెందారు.మృతుల్లో అన్న కానిస్టేబుల్ గా వేముల నాగరాజు హైదరాబాదులోని ఇబ్రహీంపట్నంలో పని చేస్తున్నాడు. తమ్ముడు కార్తీక్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రమాదానికి గురై చనిపోయినట్లు బంధువులు తెలుపుతున్నారు.తుంగతుర్తికి అమ్మమ్మకు ఇంటికి దసరా పండుగకు వచ్చి తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా జరగడంతో తుంగతుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు, తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు