03-10-2025 12:08:50 PM
అలయ్ బలయ్ ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిసి సంతోషించా
అలయ్ బలయ్ ఘనంగా జరగాలని కోరుకుంటున్నా: రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: అలయ్ బలయ్ కార్యక్రమంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శుక్రవారం నాడు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలయ్ బలయ్ ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిసి సంతోషించానని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకు బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కొనియాడారు. సోదరభావాన్ని పెంపొందించే వార్షిక సాంస్కృతిక ఉత్సవమిదని రాష్ట్రపతి పేర్కొన్నారు. అలయ్ బలయ్ సంప్రదాయ వంటకాలు, జానపద కళలు ఆకర్షిస్తాయని వెల్లడించారు.
అలయ్ బలయ్( Alai Balai program) ఘనంగా జరగాలని కోరుకుంటాన్నానని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. కాగా, బండారు దత్తాత్రేయ ఆధ్యర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దత్తాత్రేయ ఏటా దసరా మర్నాడు ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నేతలు అలయ్ బలయ్ కు హాజరుకానున్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు చాటిచెప్పేలా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి తగినట్లు బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం దత్తన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.